Bandi Sanjay: ధాన్యం సేకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉంది: బండి సంజయ్

Bandi Sanjay (tv5news.in)

Bandi Sanjay (tv5news.in)

Bandi Sanjay: తెలంగాణలో వరి సేకరణ అంశం రాజకీయ దుమారం రేపుతోంది.

Bandi Sanjay: తెలంగాణలో వరి సేకరణ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీకి కేసీఆర్‌ రాసిన లేఖలో ప్రజలను తప్పుదోప పట్టించేలా అనేక అవాస్తవాలు ఉన్నాయని లేఖలో సంజయ్ ఆరోపించారు. కేసీఆర్‌ చెప్పేవి అబద్ధాలేనని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఆధారాలతో సహా బయటపెట్టారని.. సంజయ్ అన్నారు. వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలన్న ఆయన.. లేనిపక్షంలో కేసీఆర్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు.

ఇక పంజాబ్‌ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం బియ్యం సేకరిస్తుందే తప్ప.. ధాన్యం సేకరించడం లేదని లేఖలో వివరించారు. యాసంగిలో వరి ధాన్యం కేంద్రం కొనబోదన్నది పూర్తి అబద్ధమన్నారు. వానాకాలం మాదిరిగానే యాసంగిలోనూ సేకరిస్తుందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ధాన్యం సేకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. మిల్లర్లతో కుమ్మక్సై రేషన్‌ బియ్యం రీ సైక్లింగ్‌, లేని పంటను లెక్కల్లో చూపడం, పక్క రాష్ట్రాల్లోని బియ్యాన్ని తెచ్చి అమ్మినట్లు సమాచారముందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story