Top

బంగారు, వెండి జరీ అంచుతో బతుకమ్మ చీరలు..

ఈ సారి 287 రకాల చీరలను తయారు చేయించారు. అక్టోబర్ 9 నుంచి వీటిని పంపిణీ చేస్తారు.

బంగారు, వెండి జరీ అంచుతో బతుకమ్మ చీరలు..
X

తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీకి అంతా సిద్ధమైంది. గత ఏడాది 110 రకాల చీరలు అందుబాటులో ఉంటే ఈసారి 287 రకాల చీరలను తయారు చేయించారు. బంగారు, వెండి జరీ అంచుతో బతుకమ్మ చీరలు సిద్ధం చేశారు. అక్టోబర్ 9 నుంచి వీటిని పంపిణీ చేస్తారు. 317 కోట్ల వ్యయంతో కోటి రెండు లక్షల చీరలు రెడీ అయ్యాయి. 131 సంఘాల సిరిసిల్ల చేనేత కార్మికుల ఆధ్వర్యంలో వీటిని తయారు చేశారు. ప్రత్యక్షంగా 6 వేల మంది, పరోక్షంగా 8 వేల మందికి దీనివల్ల ఉపాధి లభించింది. నేతన్నకు భరోసా ఇచ్చేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి KTR అన్నారు. హైదరాబాద్‌లో బతుకమ్మ చీరల ప్రదర్శనను మంత్రులు కేటీఆర్‌, సబిత, సత్యవతి రాథోడ్‌, టెస్కో ఎండీ శైలజరామయ్యర్‌, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు.

Next Story

RELATED STORIES