BBC IT Raid: నెక్స్ట్ టార్గెట్ హిండెన్ బర్గేనా...!

BBC IT Raid: నెక్స్ట్ టార్గెట్ హిండెన్ బర్గేనా...!
బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులపై స్పందించిన కేటీఆర్; నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనంటూ ట్వీట్....

బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ప్రభుత్వ వైఖరితో ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలు నవ్వులపాలవుతున్నాయని, భాజాపా తోలుబొమ్మలు ఆడుకున్న చందాన్న ఈ విభాగాలతో ఆడుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఓ డాక్యుమెంటరినీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకార చర్యగానే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. తదుపరి దాడి హిండెన్ బర్గ్ సంస్థపై చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. మంగళవారం బీబీసీ ఢిల్లీ, ముంబై కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల ఫోన్ లు సీజ్ చేసి, వారిని వెళ్లిపోవాల్సందిగా అధికారులు సూచించారు. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పై బీబీసీ ఇండియా: ది మోడీ క్వశ్చన్ అని ఓ డాక్యుమెంటరినీ రిలీజ్ చేసింది. ఈ దాడుల్లో ఇస్లామ్ కు చెందిన వారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, కొన్ని లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ దారుణాలన్నింటికీ మోదీనే బాధ్యుడు అన్నట్లు బీబీసీ వర్ణించింది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జయరామ్ రమేశ్ కూడా బీబీసీ పై ఐటీ దాడులను తప్పుబట్టారు. అదానీ కేసును తప్పుదోవ పట్టించేందుకే బీబీసీ పై ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story