జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల

జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదలైంది.

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదలైంది. నిన్న ఆమెకి బెయిల్ మంజూరు కాగా, చంచల్ గూడ జైలు నుంచి ఇవాళ విడుదల అయింది. ఈ సందర్భంగా ఆమె బంధువులు.. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచి అనుచరులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

శుక్రవారం ఆమెకు సికింద్రాబాద్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయగా.. రూ.10 వేల పూచీకత్తుతోపాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అటు బెయిల్ మంజూరు సందర్భంగా ప్రతి 15 రోజులకోకసారి బోయిన్ పల్లి పోలిస్ స్టేషన్ లో సంతకం చేయాలనీ కోర్టు అఖిలప్రియకు షరతు విధించింది. అటు ఇదే కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఆమె భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

Tags

Read MoreRead Less
Next Story