ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు చేదు అనుభవం..!

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు చేదు అనుభవం..!
పల్లెప్రగతి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు గ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది .

ఖమ్మంజిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమం రసాభాసగా మారింది. పల్లెప్రగతి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు గ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది . గ్రామ సర్పంచ్‌ సామ్రాజ్యం తీరుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఎమ్మెల్యే ఎదుట నిరసనకు దిగారు . సర్పంచ్ తో పాటు అతని కుమారుడు వెంకట్‌ లాల్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. తమను పట్టించుకునే నాథుడే లేడని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గ్రామస్తులకు సర్ది చేప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. దీంతో ఎమ్మెల్యే చేసేదేమి లేక కార్యక్రమం మధ్యలోనే వెనుదిరిగారు.

Tags

Read MoreRead Less
Next Story