BJP : జైలు నుంచి కార్యకర్తలకు బండి సంజయ్ సందేశం

BJP : జైలు నుంచి కార్యకర్తలకు బండి సంజయ్ సందేశం
కుట్రలో భాగంగానే తనపై టెన్త్ పేపర్ లీక్ కేసు పెట్టారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంతో కుట్రలు, కుతంత్రాలకు ఒడిగడుతోందన్నారు

బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కార్యకర్తలకు బండి సంజయ్ జైలు నుంచి సందేశమిచ్చారు. కుట్రలో భాగంగానే తనపై టెన్త్ పేపర్ లీక్ కేసు పెట్టారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంతో కుట్రలు, కుతంత్రాలకు ఒడిగడుతోందన్నారు.. టీఎస్సీఎస్సీ లీకేజీలో వైఫల్యాలు, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినందుకే.. తనపై కుట్ర కేసు మోపి జైలుకు పంపారన్నారు.

ఈ నాలుగు దశాబ్దాల్లో బీజేపీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందన్నారు బండి సంజయ్‌.. పార్టీ కోసం ఎంతో మంది తమ జీవితాలనే త్యాగం చేశారని గుర్తు చేశారు.. మరెందరో తమ ప్రాణాలను అర్పించారన్నారు.. మహోన్నతమైన భారతీయ సమాజం నిర్మాణమే బీజేపీ అంతిమ లక్ష్యమని లేఖలో పేర్కొన్నారు.. గిట్టని పార్టీలు, పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనమీద ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఒడిగడతాయన్నారు.. తనకు కేసులు, అరెస్టులు, జైళ్లు కొత్త కాదన్నారు.. ప్రజల కోసం ఎన్నిసార్లు జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమన్నారు బండి సంజయ్‌.

30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో, వాళ్ల కుటుంబాలతో కేసీఆర్‌ ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు.. తమ కుటుంబ సభ్యులకు, పార్టీ నేతల అనుచరులకు, వందమాగదులకు ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలే రాకుండా చేస్తోందని మండిపడ్డారు.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమేనా అని ప్రశ్నించారు.. ఇక మాకు ఉద్యోగాలు రావా అనే నిరాశ, నిస్పృహలో నిరుద్యోగ యువత ఉందంటూ భావోద్వేగంతో లేఖ రాశారు.. నాడు తమ స్వార్థం కోసం 27 మంది ఇంటర్‌ విద్యార్థులను బలి తీసుకుందని, ఈనాడు టెన్త్‌ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story