తెలంగాణ

GHMC ఆఫీసు ఘటనపై టీఆర్‌ఎస్‌ విమర్శలకు బీజేపీ కౌంటర్‌..!

GHMC ఆఫీసులో తాము చేపట్టిన నిరసనపై విమర్శలు చేసిన TRS సభ్యులకు... BJP కార్పొరేటర్లు కౌంటర్ ఇచ్చారు.

GHMC ఆఫీసు ఘటనపై టీఆర్‌ఎస్‌ విమర్శలకు బీజేపీ కౌంటర్‌..!
X

GHMC ఆఫీసులో తాము చేపట్టిన నిరసనపై విమర్శలు చేసిన TRS సభ్యులకు... BJP కార్పొరేటర్లు కౌంటర్ ఇచ్చారు. నిరసన తెలిపేందుకు మాత్రమే తాము ఆఫీసులోకి వెళ్లామని.. ధ్వంసం చేయడం తమ ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. అవసరమైతే తాము మేయర్‌కు క్షమాపణ చెబుతామని... కానీ దానికి ముందు కౌన్సిల్ సమావేశం నిర్వహించి.. డివిజన్ల అభివృద్ధిపై చర్చించాలని కోరారు.

GHMC ని అప్పుల కుప్పగా మార్చారని.. ప్రజల నుంచి ముక్కు పిండి టాక్స్ వసూలు చేస్తున్న అధికారులు... ప్రగతి భవన్‌ కున్న 25 కోట్ల బకాయిని ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు. మరోవైపు అమరవీరుల స్థూపం దగ్గర బీజేపీ కార్పొరేటర్లు ఉరితాళ్లతో ఆందోళన చేపట్టారు. అరెస్టులకైనా సిద్ధమేనని అవసరమైతే ప్రజల కోసం ఉరి వేసుకోడానికి కూడా సిద్ధమేనని అన్నారు.

నగరంలో అభివృద్ధి గురించి కేటీఆర్‌ ముందు దృష్టి సారించి ఆ తర్వాత మాట్లాడాలని కార్పొరేటర్లు హితవు పలికారు.మరోవైపు.. బీజేపీ కార్పొరేటర్ల దాడి ఘటనను తీవ్ర ఖండించారు ఎమ్మెల్యే దానం నాగేందర్‌. బీజేపీ కార్పొరేటర్లు తక్షణమే రాజీనామా చేసి.. మేయర్‌ కు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ ఘటనపై చట్టబద్ధమైన చర్యలుంటాయని దానం నాగేందర్‌ హెచ్చరించారు.

Next Story

RELATED STORIES