Ap, Telangana BJP: ప్రక్షాళన కాదు.. ఎన్నికల వ్యూహం..!

Ap, Telangana BJP: ప్రక్షాళన కాదు.. ఎన్నికల వ్యూహం..!


ప్రక్షాళన కాదు.. ఎన్నికల వ్యూహం.. వచ్చే ఎన్నికల్లో బలమైన పార్టీగా బీజేపీని నిలబెట్టే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ఖరారు చేసిన వ్యూహం.. ఆ వ్యూహంలో భాగమే తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చింది అధిష్ఠానం.. ఏపీ బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజును తప్పించిన అధిష్ఠానం.. దగ్గుబాటి పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించింది.. అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డిని నియమించింది.. తెలుగు రాష్ట్రాల కొత్త అధ్యక్షుల నియామకానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన వెలువడింది.

బీజేపీలో సంస్థాగత మార్పులకు సంబంధించి కొద్దిరోజులుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రచారం జరుగుతోంది.. ముఖ్యంగా తెలంగాణ అధ్యక్షుడిని మార్చుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.. ఆ వార్తలను నిజం చేస్తూ బీజేపీ హైకమాండ్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.. బీజేపీలో మార్పుల విషయాన్ని టీవీ5 ఎప్పుడో చెప్పింది.. కొద్దిరోజులుగా దీనిపై వరుస కథనాలు ప్రసారం చేసింది.. బండి సంజయ్‌ని మార్చి ఆ స్థానాన్ని కిషన్‌ రెడ్డితో భర్తీ చేయనున్నట్లుగా బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు టీవీ5 ముందుగానే చెప్పింది.. టీవీ5 కథనాలనే నిజం చేస్తూ బీజేపీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ అధ్యక్షుడి మార్పు అందరూ ఊహించిదే అయినా, ఏపీ అధ్యక్షుడి మార్పు ఎవరూ ఊహించలేదు.. దగ్గుబాటి పురందేశ్వరి పేరును ఫైనల్‌ చేసిన బీజేపీ అధిష్ఠానం దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల మార్పులకు సంబంధించి వేర్వేరు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో నాయకత్వ మార్పుపై ఎప్పుట్నుంచో అధిష్ఠానం ఆలోచిస్తోంది.. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై అధిష్ఠానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి.. ముఖ్యంగా వైసీపీకి కోవర్టు అంటూ సోము వీర్రాజుపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.. సీనియర్‌ నేతలను కాదని, ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా వివాదాస్పదమయ్యాయి.. ఈ కారణాలన్నిటితో సోము వీర్రాజును అధ్యక్ష బాధ్యతల నుంచి అధిష్ఠానం తొలగించింది. అదే సమయంలో పార్టీ పగ్గాలను దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇక తెలంగాణలో బండి సంజయ్‌ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ మరింత పుంజుకుంది.. క్షేత్రస్థాయిలో బీజేపీ ఎంతగా బలపడిందో ఇప్పుడున్న పరిస్థితులే ఉదాహరణ.. అనేక సందర్భాల్లో బీజేపీ అధిష్ఠానం కూడా బండి సంజయ్‌ని పొగడ్తల్లో ముంచెత్తింది.. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా లాంటి అగ్రనేతలు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు బండి సంజయ్‌ పనితీరు చూసి అబ్బురపడ్డారు.. స్వయంగా బండి సంజయ్‌ భుజం తట్టి ప్రోత్సహించారు.. అయితే, చేరికల తర్వాత తెలంగాణ బీజేపీలో మార్పులు చోటు చేసుకున్నాయి.. సీనియర్లు, బయటి నుంచి వచ్చిన నేతలు అనే భావన పడిపోయింది.. ఈ విభేదాల కారణంగానే బండి సంజయ్‌ని మార్చారనే ప్రచారం జరుగుతోంది.. అయితే, బండి సంజయ్‌ని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డికి రాష్ట్ర పగ్గాలు అప్పగించింది.. బీజేపీ హైకమాండ్‌ నిర్ణయం ఏదో రొటీన్‌గా జరిగిందని కాదని, తెలుగు రాష్ట్రాల్లో పార్టీని మరింత పుంజుకునే దిశగానే సుదీర్ఘ కసరత్తు చేసి నేతల్ని ఫైనల్‌ చేసినట్లుగా చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story