సచివాలయంను నిజాం ఫోర్టు లాగా మార్చారు: మురళీధర్ రావు

సచివాలయంను నిజాం ఫోర్టు లాగా మార్చారు: మురళీధర్ రావు

దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాల్లో ఎలాంటి లీకేజ్ లేకుండా మోదీ పాలన సాగుతోందని అన్నారు బీజేపీ మధ్య ప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్ రావు. పాలనలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని కొనియాడారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఇందుకు వ్యతిరేకంగా సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో హక్కుల కోసం పోరాడడానికి అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య పాలన చేస్తుంటే.. తెలంగాణ లో కుటుంబ, తప్పుల తడక పాలన సాగుతోందని చెప్పారు.

పరీక్షలు జవాబుదారీతనం లేకుండా నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం స్కీం కింద 30వేల ఇల్లు కూడా ఇవ్వలేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్ ఎన్నికల కోసమే హామీ లను ఇస్తాడు.. ఎన్నికల అనంతరం ఆ పథకాలు అమలు చేయరని ఆరోపించారు. దళిత బంధు పంపిణీ లో అవినీతి కి కేసీఆరే బాధ్యుడని అన్నారు. ధరణిని ల్యాండ్ లిటికేషన్ సెటిల్మెంట్ కోసమే తీసుకుని వచ్చారని ఆరోపించారు మురళీధర్ రావు. సచివాలయం ను నిజాం ఫోర్టు లాగా మార్చారని అన్నారు. ఆర్టీఐ వ్యవస్థ ను పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. ఉద్యోగులకు కనీసం ఒకటవతేదీ ను జీతభత్యాలు ఇవ్వడం లేదని చెప్పారు. ఎమ్మెల్యే లు, మంత్రులు ప్రతి పనికి రేట్ కార్డ్ కడుతున్నారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story