జనగామలో టెన్షన్.. టెన్షన్!
పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకు జనగామకు చేరుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

X
Vamshi Krishna13 Jan 2021 9:03 AM GMT
పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకు జనగామకు చేరుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జనగామ చౌరస్తా నుంచి ప్రభుత్వాసుపత్రికి భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాసేపట్లో బండిసంజయ్ ఆసుపత్రిలో ఉన్న పార్టీ కార్యకర్తలను పరామర్శించనున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారనుండటంతో ఆసుపత్రితో పాటు బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు భారీగా పోలీసులు మోహరించారు.
జనగామ మున్సిపల్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. వివేకానందుడి ఫ్లెక్సీ పెడితే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు టార్గెట్ చేస్తున్నారని, ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. దెబ్బకు దెబ్బ తీస్తామని , సీఎంతో యుద్ధం చేయడానికి సిద్దమని హెచ్చరించారు బండి సంజయ్.
Next Story