BJP: నేటి నుంచే బీజేపీ రథయాత్రలు

BJP:  నేటి నుంచే బీజేపీ రథయాత్రలు
17 ఎంపీ స్థానాల్లో విజయ సంకల్పయాత్రలు.... పాల్గొననున్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

పార్లమెంట్ ఎన్నికల సమరశంఖం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో మెజార్టీ సీట్లలో గెలుపై లక్ష్యంగా కమలదళం ప్రజల వద్దకు వెళ్తోంది. నేటి నుంచి మార్చి 2వరకు విజయ సంకల్పయాత్రల పేరిట రథయాత్రలు చేపడుతోంది. పార్లమెంట్‌ నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించిన బీజేపీ నేడు 4 క్లస్టర్స్‌లో యాత్రలకి శ్రీకారం చుడుతోంది. మేడారం జాతరతో కాకతీయ-భద్రకాళీ క్లస్టర్‌యాత్ర రెండు, మూడ్రోజులు ఆలస్యంగా మొదలుకానుంది. యాత్రల ప్రారంభానికి అసోం, గోవా ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. తెలంగాణలోని 17లోక్‌సభ నియోజకవర్గాల్లో కనీసం పదిసీట్లు, 35శాతం ఓటు బ్యాంకే లక్ష్యంగా నేటి నుంచి రథయాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 114 స్థానాలు 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలను ఐదుక్లస్టర్స్‌గా విభజించిన పార్టీ 5 వేల 500 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టనుంది. ఆయాత్రల్లో 106 సమావేశాలు 102 రోడ్‌షోలు, 180 రిసెప్షన్స్‌, 79 ఈవెంట్స్‌ నిర్వహించేలా ప్రణాళికలు చేసింది.


కొమరంభీం క్లస్టర్‌ విజయ సంకల్ప యాత్ర బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాక భైంసా నుంచి మొదలవుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానాల్లో 12రోజులపాటు సుమారు 1,056 కిలోమీటర్ల మేర జరుగుతుంది. ఆ యాత్రను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రారంభించనున్నారు. ఆ యాత్రలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ పాల్గొననున్నారు. రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్‌ స్థానాల్లో 1,217 కిలోమీటర్లు సాగనుంది ఆయాత్రని వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లోకేంద్రమంత్రి BLవర్మ ప్రారంభిస్తారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండిసంజయ్‌ భాగస్వామ్యం కానున్నారు. భాగ్యనగర విజయ సంకల్ప యాత్ర యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో మొదలవుతుంది భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానాల్లో జరిగే ఆ యాత్రని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర నాయకత్వం తరపున ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ పాల్గొంటారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి వెల్లడించారు.


మేడారం జాతర వల్ల కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర రెండ్రోజులు ఆలస్యంగా ప్రారంభం అవుతుందని బీజేపీ తెలిపింది. భద్రాచలంలో మొదలయ్యే ఆ యాత్రను ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయ్‌ ప్రారంభిస్తారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో 1,015 కిలోమీటర్లు, 7 రోజులపాటు యాత్ర సాగనుంది. మక్తల్‌ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామం సమీపంలోని కృష్ణా నదికి పూజలు చేసిన తర్వాత విజయ సంకల్ప యాత్ర ప్రారంభంకానుంది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో సాగే ఆ యాత్రని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా ప్రారంభించనున్నారు. పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్‌రెడ్డి, డీకే.అరుణ, జితేందర్‌రెడ్డి అందులో పాల్గొంటారు. సుమారు 1,440 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ఒక్కోయాత్రలో ముఖ్య నేతలు 2 రోజులు పాల్గొననున్నారు.

Tags

Read MoreRead Less
Next Story