BJP: బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్యే పొత్తు: బీజేపీ

BJP: బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్యే పొత్తు: బీజేపీ
తెలంగాణలో జోరుగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలే లక్ష్యంగా.. పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గ్రామగ్రామాల్లో తిరుగుతూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. ఓవైపు గతప్రభుత్వ పదేళ్ల పాలనలోని వైఫల్యాలు ఎండగడుతూనే.. అధికార కాంగ్రెస్‌పై హామీల అమలెప్పుడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తాచాటేలా సమరశంఖం పూరించిన భారతీయ జనతా పార్టీ.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టేసేలా చేపట్టిన విజయ సంకల్ప యాత్రలు మూడోరోజు కొనసాగాయి. ఆదిలాబాద్‌లో నిర్వహించిన యాత్రలో పాల్గొన్న ఈటల రాజేందర్.. మూడోసారి మోదీ.. ప్రధాని అవ్వడం ఖాయమని పునరుద్ఘాటించారు. అధికారం కోసం ఇష్టమొచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చిందని... అవి ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు.


బీజేపీ, బీఆర్‌ఎస్‌ పొత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు మధ్యే లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కొడంగల్‌లో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారన్నారు. అమలు సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. మూడు నెలలు కావస్తున్నా.. ఇచ్చిన హామీలు అమలుచేయలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో MLA ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. (TG-NLG -200-22) నల్గొండ జిల్లా నకిరేకల్‌, మునుగోడు నియోజవర్గాల్లో నిర్వహించిన యాత్రలో.. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.


పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండంకెల స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. 114 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 5,500ల కిలోమీటర్లను సంకల్ప యాత్రల ద్వారా కమలం నేతలు చుట్టేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story