Black Fungus In Telangana : తెలంగాణలో భారీగా పెరిగిన బ్లాక్ ఫంగస్ కేసులు

Black Fungus In Telangana : తెలంగాణలో భారీగా పెరిగిన బ్లాక్ ఫంగస్ కేసులు
Black Fungus In Telangana : బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. రోజురోజుకి ఇన్ఫెక్షన్ బారిన పడినవారు, అనుమానితుల సంఖ్య పెరిగిపోతుంది.

Black Fungus In Telangana : బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. రోజురోజుకి ఇన్ఫెక్షన్ బారిన పడినవారు, అనుమానితుల సంఖ్య పెరిగిపోతుంది. శుక్రవారం నాటికి రాష్ట్రంలో బాధితుల సంఖ్య 390కి చేరింది. హైదరాబాదులోని ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కు చికిత్స అందిస్తున్న కోఠి లోని ఈఎన్ టీ ఆస్పత్రి రోగులతో నిండిపోయింది. 200 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో కేసుల పెరుగుదల దృష్ట్యా అదనంగా మరో 30 పడకల సిద్ధం చేశారు.

అదనపు పడకలు ఏర్పాటుచేసిన గంటలోపే అవన్నీ నిండిపోయాయి. బ్లాక్ ఫంగస్ చికిత్స నేపథ్యంలో ఇప్పుడు పడకల సంఖ్య 230 కి పెరిగింది. రోగులకు సేవలు అందించడం ఉన్న సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ప్రతి బ్లాక్ రోగికి రోజుకు 4 ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లు, మందులు అందజేయాల్సి ఉంటుంది. నర్సులు, సిబ్బంది సంఖ్య తక్కువ కావడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. బ్లాక్ ఫంగస్ ఆయుర్వేదిక్ చికిత్స తో చెక్ పెట్టేందుకు వైద్యులు సిద్ధమయ్యారు.



Tags

Read MoreRead Less
Next Story