భగీరథ నీళ్ల బాటిళ్లే వాడాలి: సీఎం కేసీఆర్
ప్రస్తుతం బాటిళ్ల ద్వారా కూడా అందుబాటులోకి వచ్చినందున గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఈ నీటినే వినియోగించాలని కోరారు.

X
Vamshi Krishna24 Jan 2021 4:50 AM GMT
ప్రజలు మిషన్ భగీరథ నీటిని తాగేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ ద్వారా ఆరోగ్యకరమైన, పరిశుద్ధమైన మంచినీళ్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం బాటిళ్ల ద్వారా కూడా అందుబాటులోకి వచ్చినందున గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఈ నీటినే వినియోగించాలని కోరారు. ఈ నీళ్లలో అన్ని మినరల్స్ తగిన పాళ్లలో ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ప్రగతిభవన్‌లో శనివారం సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
మిషన్ భగీరథ నీళ్లు ప్రస్తుతం బాటిళ్ల ద్వారా కూడా అందుబాటులోకి వచ్చినందున గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఈ నీటినే వినియోగించాలని కోరారు. ప్రజలు కూడా మిషన్ భగీరథ నీటిని తాగాలని పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ నీళ్లలో అన్ని మినరల్స్ తగిన పాళ్ళలో ఉన్నాయని సీఎం చెప్పారు.
— Telangana CMO (@TelanganaCMO) January 23, 2021
Next Story