తెలంగాణ

శోభనం రాత్రే గొడవ.. నవ వధువు ఆత్మహత్యాయత్నం

శోభనం రాత్రే గొడవ.. నవ వధువు ఆత్మహత్యాయత్నం
X

పెళ్లైన నాలుగు రోజులకే నవ వధువు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్టలో జరిగింది. ప్రగతినగర్‌ SVR హైస్కూల్‌ సమీపంలో నివాసం ఉంటున్న వ్యక్తి.. బతుకుదెరువు కోసం తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం బొట్టుచెరువు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మేస్త్రి పనిచేసుకునే అతని పెద్ద కుమార్తెకు ఈ నెల 6న వెంకటేశ్వరావుతో వారి స్వగ్రామంలో పెళ్లి జరిగింది. ఆ తర్వాత 9వ తేదిన శోభనం ఏర్పాటు చేశారు. ఆ రోజు జరిగిన గొడవతోనే తమ కూతురు ఆత్మహత్యాయత్నం చేసిందని.. వధువు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వధువుకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Next Story

RELATED STORIES