BRS : నాగార్జున సాగర్‌ బీఆర్ఎస్‌లో వర్గపోరు

BRS : నాగార్జున సాగర్‌ బీఆర్ఎస్‌లో వర్గపోరు
ఉద్యమకారులను పక్కన పెడుతున్నారని.. పైరవీకారులు, ఒక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తు‌న్నారంటూ గంగాభవని ఆరోపించారు

నాగార్జున సాగర్‌ బీఆర్ఎస్‌లో మరోసారి వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే నోముల భగత్ వైఖరిపై మహిళా నేత గంగాభవాని యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపట్లో అనుముల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం ఉంది.. ఐతే.. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా వెంకటేశంని ఎలా చేస్తారంటూ.. గంగాభవాని ఘాటుగా ప్రశ్నించిన ఆడియో.. ప్రమాణ స్వీకారానికి ముందు వైరల్‌గా మారింది. ఉద్యమకారులను పక్కన పెడుతున్నారని.. పైరవీకారులు, ఒక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తు‌న్నారంటూ గంగాభవని ఆరోపించారు. ఎమ్మెల్యేనే సుప్రీమా? అంత మగోడా అంటూ గంగా భవాని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలతోనే బుద్ధి చెప్పిస్తామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story