BRS BSP Alliance : బిఎస్పితో బిఆర్ఎస్ పొత్తు

BRS BSP Alliance :  బిఎస్పితో బిఆర్ఎస్ పొత్తు
ఇకపై కలిసి పనిచేయాలని నిర్ణయం

లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్... బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం సమన్వయంతో, సంయుక్తంగా ముందుకు సాగుతామన్న నేతలు ఆ కోణంలోనే ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిరిందన్నారు. సీట్లపంపకాలు సహా విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో భారాస – బహుజన సమాజ్​ పార్టీ మధ్య పొత్తు కుదిరింది. BSP రాష్ట్రఅధ్యక్షుడు R.S ప్రవీణ్‌కుమార్‌.. హైదరాబాద్‌ నందినగర్‌లోని KCR నివాసానికి వెళ్లి పలు రాజకీయ అంశాలపై చర్చించారు. పార్లమెంట్​ ఎన్నికల్లో పొత్తులపై స్థూలంగా చర్చలు జరిపారు. అనంతరం రాష్ట్రంలో ఇరుపార్టీలు కలిసి ముందుకు సాగుతున్నట్లు ప్రకటించారు. సిద్ధాంతపరంగా, భావసారూప్యతపరంగా భారాస- BSPలది ఒకే మార్గమన్న K.C.R.. సీట్లపంపకాలు, విధివిధానాలపై త్వరలోనే వివరణనిస్తామన్నారు. బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దళితబంధు అమలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు, వెనకబడినవర్గాలు, బలహీనవర్గాల అభ్యున్నతికి అనేక పథకాలను అమలుచేసిన చరిత్ర ఉన్నదని వివరించారు. వీటన్నింటిని చూసిన తర్వాతనే బీఎస్పీ నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఇద్దరం కలిసి చర్చించుకున్నామని చెప్పారు. ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీ హైకమాండ్‌తో మాట్లాడారని, కలిసి పనిచేయాలని స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చామని వివరించారు.

పొత్తులపై మాజీ ముఖ్యమంత్రితో చర్చించిన BSPరాష్ట్ర అధ్యక్షుడు.. రాష్ట్రంలో, దేశంలోనూ లౌకికత్వం ప్రమాదంలో పడిందన్నారు. వాటిని కాపాడేందుకే భారాసతో కలిసామని. R.S ప్రవీణ్‌కుమార్‌ స్పష్టంచేశారు. ఇరుపార్టీల స్నేహంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని కాంక్షించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఎస్పీ, బీఆర్ఎస్‌ పార్టీలు క‌లిసి పోటీ చేయాల‌ని సంయుక్తంగా నిర్ణయించారు. బీఎస్పీ- బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వారు సంయుక్తంగా ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సిద్ధాంత పరంగా కూడా మేము ఓకే రకంగా ఉన్నామన్నారు. దళిత బంధు సహా ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. బీఎస్పీ అధిష్టానం అనుమతితో పొత్తు ప్రస్తావన తెచ్చారన్నారు. సీట్లు, విధివిధానాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. మాయావతితో మాట్లాడతానని కేసీఆర్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story