Telangana: రెండు రోజుల నిరసనలకు BRS పిలుపు

Telangana: రెండు రోజుల నిరసనలకు BRS  పిలుపు
brs called two days protests about revanth reddy comments


తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ భగ్గుమంటుంది. కాంగ్రెస్‌ తీరుపై రెండు రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశించింది. ఉచిత విద్యుత్‌ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌ది అంటూ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. గతంలో కూడా విద్యుత్‌ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. మరోసారి తన రైతు వ్యతిరేక విధానాల్ని కాంగ్రెస్‌ బయటపెట్టిందని.. దీన్ని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు.

24 గంటల కరెంట్‌పై పీసీసీ చీఫ్‌ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలతో.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వార్‌ నడుస్తోంది. రేవంత్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పొలిటికల్‌ అటాక్‌కు దిగుతోంది. అటు.. గులాబీనేతలకు కాంగ్రెస్ సైతం ధీటుగా కౌంటర్ ఇస్తోంది. రేవంత్‌ వ్యాఖ్యల్ని వక్రీకరించి చెబుతున్నారంటూ విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. 24 గంటల కరెంట్‌ ప్రచారం కేవలం బీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రయోజనం కోసమేనంటూ ఫైర్‌ అవుతున్నారు హస్తం నేతలు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటల కరెంటు రావడం లేదన్నారు కాంగ్రెస్‌ నేతలు. అధికారం పోతుందనే భయం బీఆర్‌ఎస్‌ నేతలకు పట్టుకుందన్నారు. జగదీశ్వర్‌రెడ్డి పవర్‌ లేని పవర్‌ మినిస్టర్‌ అంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేతలు.

Tags

Read MoreRead Less
Next Story