BRS: బీఆర్‌ఎస్‌ నేతలపై దాడులను పట్టించుకోని పోలీసులు

BRS: బీఆర్‌ఎస్‌ నేతలపై దాడులను పట్టించుకోని పోలీసులు
కాంగ్రెస్‌కు పోలీసులు కొమ్ముకాస్తున్నారని డీజీపీకి గులాబీ నేతల ఫిర్యాదు

తెలంగాణలో పోలీసులు కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారని, తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ నేతల బృందం ఫిర్యాదుచేసింది. డీజీపీ రవిగుప్తా అందుబాటులో లేకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు అందజేసింది. కాంగ్రెస్ ఫిర్యాదులను వెంటనే స్వీకరిస్తున్న పోలీసులు..తమ ఫిర్యాదులను చెత్తబుట్టలో వేస్తున్నారని ఆరోపించింది. ఇటీవల ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంఎల్సీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియాకి సంబంధించి సాల్వజి మాధవరావుపై.... దాడి చేశారని ఆరోపించారు. అయన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారని చెప్పారు. ప్రతీకారంపై కాకుండా ప్రజా పాలపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేతలు సూచించారు.


తాగునీళ్లైనా ఇవ్వండి: హరీశ్‌రావు

పంటలకు సాగునీరు ఎలాగూ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజలకు గొంతు తడుపుకోడానికి మంచినీళ్లైనా ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో తాగునీటి కష్టాలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ గొంతెండిపోతుందన్న హరీష్... గుక్కెడు మంచి నీళ్లకోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారని ప్రస్తావించారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారని, ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనలోని నీటి కష్టాలు ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయని అన్నారు. పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశ్యాలు ఎప్పుడూ కనిపించలేదన్న ఆయన మారుమూల తండాల్లోనూ మిషన్ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేదని గుర్తు చేశారు. ప్రజలకు మంచినీరు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి హరీశ్ విజ్ఞప్తి చేశారు.


భువనగిరి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని హరీశ్‌రావు ఆరోపించారు. బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశాంత్ మరణంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన... ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి పాలైన 24 మంది విద్యార్థుల్లో ప్రశాంత్ మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. KCR పాలనలో ఘనకీర్తి సాధించిన గురుకులాలు... ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోతున్నాయన్నారు. ప్రజా పాలన అంటూ ప్రతీకార పాలన చేస్తున్న CM రేవంత్‌రెడ్డికి గురుకులాల విద్యార్థుల గురించి కనీసం ఆలోచించటంలేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story