గ్రేటర్‌లో ఓటేసిన సెలబ్రెటీలు

గ్రేటర్‌లో ఓటేసిన సెలబ్రెటీలు
మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 7 గంటలకే సతీసమేతంగా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత పదిహేను రోజులుగా సాగించిన విస్తృత ప్రచారానికి 48 గంటల ముందే తెరపడింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయింత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 7 గంటలకే సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచి నేతలు కావాలంటే ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. శాస్త్రిపురలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఉదయమే జుబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు వేశారు. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ, హీరో నాగశౌర్య తల్లి, నిర్మాత ఉష మూల్పూరి షేక్‌పేటలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story