Paddy: ధాన్యం సేకరణ లెక్కలు బయటికి.. తెలంగాణలో ఇప్పటి వరకు..

Paddy: ధాన్యం సేకరణ లెక్కలు బయటికి.. తెలంగాణలో ఇప్పటి వరకు..
Paddy: దేశవ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 443.49 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్రం వివరాలు వెల్లడించింది.

Paddy: ధాన్యం సేకరణ లెక్కలను ఎట్టకేలకు కేంద్రం వెల్లడించింది.. వరి కొనుగోళ్లపై కేంద్రం తీరును తెలంగాణ తీవ్రస్థాయిలో తప్పు పడుతుండగా.. ఈ అంశం పెద్ద రాజకీయ రగడనే రాజేసింది.. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన విడుదల చేసింది.. దేశవ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 443.49 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్రం వివరాలు వెల్లడించింది.

తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటి వరకు 52.88 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించినట్లుగా లెక్కలు విడుదల చేసింది. అత్యధికంగా పంజాబ్‌ నుంచి 186.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా.. హర్యానాలో 55.3 లక్షల మెట్రిక్‌ టన్నులు.. అలాగే ఛత్తీస్‌గఢ్‌ నుంచి 47.20 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పింది కేంద్రం.

కనీస మద్దతు ధరతో 47లక్షలా 3వేల మంది రైతులకు 86వేల 924 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు ప్రకటించింది.. తెలంగాణలో 7లక్షలా 84 వేలా 363 మంది రైతులకు 10 వేలా 364.88 కోట్ల లబ్ధి చేకూర్చామని చెప్పింది.. ఇక ఏపీలో ఇప్పటి వరకు 7.67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లుగా వివరాలు వెల్లడించింది కేంద్రం.. ఏపీలో మొత్తం 98,972 మంది రైతులకు 1504 కోట్ల మేర లబ్ధి చేకూర్చామని చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story