Top

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఢిల్లీలోని తన నివాసంలో విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు..

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
X

తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఢిల్లీలోని తన నివాసంలో విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని మరోమారు డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజును ఎందుకు ప్రభుత్వం అధికారికంగా జరపదని ప్రశ్నించారు.

అనేక మంది ఉద్యమ కారుల త్యాగ ఫలితంతోనే తెలంగాణకు విముక్తి దొరికిందన్నారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నప్పుడు.. తెలంగాణ ఎందుకు ఆ పని చేయదని కిషన్‌రెడ్డి నిలదీశారు. స్వాంతంత్ర్య చరిత్రను భావితరాలకు చెప్పాలన్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

Next Story

RELATED STORIES