రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనేదే మోదీ సర్కారు లక్ష్యం : కిషన్‌రెడ్డి

రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనేదే మోదీ సర్కారు లక్ష్యం : కిషన్‌రెడ్డి
సెప్టెంబర్ 10వ తేదీకల్లా తెలంగాణకు 10 లక్షల 17 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుతాయి

రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యానికి మోదీ సర్కారు కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. సెప్టెంబర్ 10వ తేదీకల్లా తెలంగాణకు 10 లక్షల 17 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుతాయని చెప్పారు. 6 వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులతో పునఃప్రారంభం అవుతున్న రామగుండం ఎరువుల పరిశ్రమ నెలాఖరు నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తుందన్నారు. రామగుండంలో ఉత్పత్తి అయ్యే కిసాన్ యూరియా సింహభాగం తెలంగాణకేనన్నారు కిషన్‌రెడ్డి. రాష్ట్రానికి అదనపు ఎరువుల కేటాయింపుపై కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రితో చర్చించిన ఆయన.. రైతులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


Tags

Read MoreRead Less
Next Story