హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు..!

హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు..!
కరోనా నేపథ్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నట్లు టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు.

హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నట్లు టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసిన నేత చంద్రబాబు అని గుర్తు చేశారు. బాల్యదశ నుంచి ఎంతో కష్టపడి స్వయం కృషితో పైకి ఎదిగిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శిఅజ్మీరా రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story