దుబ్బాక ఉప ఎన్నికకు ముందు చోటు చేసుకున్న కీలక పరిణామం

దుబ్బాక ఉప ఎన్నికకు ముందు చోటు చేసుకున్న కీలక పరిణామం

దుబ్బాక ఉప ఎన్నికకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.. గాంధీ భవన్‌లో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీపీపీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికను టీ కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలంతా అక్కడే మకాం వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గ్రామాల వారిగా ఇంఛార్జ్ లను వేసిన పీసీసీ ..

ఓక్కో ముఖ్యనేతకు ఓక్కో గ్రామం భాధ్యత అప్పగించింది. బుధవారం నుంచి 12తేదీ వరకు దుబ్బాక లోనే నేతలంతా ఉండనున్నారు.

చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ లోకి అహ్వానిస్తున్నామన్నారు ఉత్తమ్‌. చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ లో మంచి రాజకీయ భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటోందని.. దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట-గజ్వేల్ కి మధ్యలో ఉండడంతో.. టీఆరెస్ ప్రభుత్వం దుబ్బాకకు ఏం చేసిందో నిలదియ్యాలన్నారు ఉత్తమ్‌.

దుబ్బాక ఉపఎన్నిక ఆత్మగౌరవ ఎన్నిక అన్నారు కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి. దుబ్బాకకు కనీసం బస్సు-నీళ్లు లేని పరిస్థితుల్లో నుంచి తన తండ్రి ముత్యం రెడ్డి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. 30 ఏళ్ళ పాటు ప్రజల కోసం పోరాడితే.. టీఆర్‌ఎస్‌ అవమానకరంగా రిటన్ గిఫ్ట్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story