నాన్ వెజ్ ప్రియులకి శుభవార్త... భారీగా తగ్గిన చికెన్ ధర..!

నాన్ వెజ్ ప్రియులకి శుభవార్త... భారీగా తగ్గిన చికెన్ ధర..!
తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య డిమాండ్‌ తగ్గడం, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో గత నెల రోజుల్లోనే కిలో బ్రాయిలర్‌ కోడి మాంసం ధర రూ.270 నుంచి 170కి తగ్గింది.

ఇది నాన్ వెజ్ ప్రియులకి శుభవార్తననే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య డిమాండ్‌ తగ్గడం, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో గత నెల రోజుల్లోనే కిలో బ్రాయిలర్‌ కోడి మాంసం ధర రూ.270 నుంచి 170కి తగ్గింది.సభలు, సమావేశాలు, ఫంక్షన్లు జరగకపోవడంతో 70 శాతం మంది మాత్రమే చికెన్ కొంటున్నారు. దీనితో 30 శాతం డిమాండ్ పడిపోయిదని చెప్పాలి. తెలంగాణలో కరోనా తీవ్రత కి ముందు 9లక్షల కోడి మాంసం అమ్మగా, ఇప్పుడు 5 లక్షల కిలోలకు మించడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ వల్ల అమ్మకాలు తగ్గాయని కోళ్ల ఫారాల సమాఖ్య తెలిపింది. అటు కోడి ధరలు మాత్రం మండిపోతున్నాయి. ఇక వారం క్రితం రూ.4.56 కాగా... ఇప్పుడు రూ.3.10 పడిపోయి మళ్ళీ కోలుకుంటుంది.

Tags

Read MoreRead Less
Next Story