సవాల్ : ఒకే కారులో బయలుదేరిన మంత్రి తలసాని, సీఎల్పీ నేత బట్టి

సవాల్ : ఒకే కారులో బయలుదేరిన మంత్రి తలసాని, సీఎల్పీ నేత బట్టి
సవాల్ : ఒకే కారులో బయలుదేరిన మంత్రి తలసాని, సీఎల్పీ నేత బట్టి సవాల్ : ఒకే కారులో బయలుదేరిన మంత్రి తలసాని, సీఎల్పీ నేత బట్టి సవాల్ : ఒకే కారులో బయలుదేరిన మంత్రి తలసాని, సీఎల్పీ నేత బట్టి

హైదరాబాద్‌లో డబుల్‌బెడ్ రూం ఇళ్లపై అధికార, విపక్షాల మధ్య వార్ ఆసక్తికర మలుపు తిరిగింది. నిన్న అసెంబ్లీలో మంత్రి తలసాని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో ఇద్దరూ కలిసి ఇవాళ కొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో డబుల్‌బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని స్వయంగా చూపిస్తానంటూ చెప్పిన తలసాని.. ఉదయాన్నే భట్టి విక్రమార్క నివాశానికి వెళ్లారు. భట్టి సవాల్ స్వీకరించానని చెప్తూ ఇళ్ల పరిశీలనకు వెళ్తామని చెప్పారు. అనుకోని అతిథికి స్వాగతం పలికిన భట్టి కూడా పర్యటనకు సిద్ధమన్నారు. ఐతే.. ఇళ్లతోపాటు హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చూసొద్దామన్నారు. 70 వేల కోట్లతో హైదరాబాద్‌లో ఏం అభివృద్ధి జరిగిందో చూడడంతోపాటు రాత్రి కురిసిన వర్షాలకు నగరంలో పరిస్థితి ఎలా తయారైందో కూడా చూద్దామన్నారు భట్టి. ఈ నేపథ్యంలో ఇద్దరి నేతల పర్యటన ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఒకే కారులో ఇళ్ల పరిశీలనకు బయలుదేరారు. మంత్రి తలసాని వెంట మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు. భట్టి వెంట వీహెచ్ ఉన్నారు. ముందుగా వీరు జియాగూడ వెళ్లనున్నారు.

ఉదయం పదిన్నర సమయంలో భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లిన మంత్రి తలసాని దాదాపు అరగంటపాటు అక్కడ ఉన్నాక .. పలు ప్రాంతాల్లో ఇళ్లు పరిశీలించేందుకు బయలుదేరారు. జియాగూడ, గొడికే ఖబర్, కట్టెలమండి, సీసీ నగర్‌, అంబేద్కర్ నగర్‌, కొల్లూరుల్లో డబుల్ బెట్ ఇళ్లను వీరిద్దరూ పరిశీలించనున్నారు. అధికార పార్టీ, విపక్షాల మధ్య తరచూ పలు అభివృద్ధి అంశాలపై సవాళ్లూ, ప్రతిసవాళ్లూ సాధారణమే అయినా ఇప్పుడు ఏకంగా మంత్రి తలసానే స్వయంగా భట్టి ఇంటికి రావడం ఆసక్తికరంగా మారింది. ఇళ్ల సందర్శనకు బయలుదేరిన నేతల వెంట పలువురు కార్యకర్తలు కూడా ఉన్నారు. మధ్యాహ్నం వరకూ వీరి పర్యటన కొనసాగనుంది.

హైదరాబాద్‌లో డబుల్‌బెడ్‌ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులెన్ని? ఎంత మందికి ఇచ్చారు..? గత ఎన్నికల సమయంలో ఏం హామీ ఇచ్చారు అని నిలదీశారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తున్నందునే ఇళ్ల పంపిణీ చేస్తామంటున్నారని విమర్శించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన మంత్రి తలసాని తానే స్వయంగా తీసుకెళ్లి ఇళ్లు చూపిస్తానన్నారు. లక్ష ఇళ్లు చూపిస్తానంటే రావడానికి తనకు అభ్యంతరం లేదని భట్టి అన్నారు. ఆ సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలోనే ఇవాళ ఇద్దరూ కలిసి పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇళ్లను స్వయంగా పరిశీలించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story