నరేంద్ర లూథర్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం!
అయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. లూథర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

X
Vamshi Krishna19 Jan 2021 10:30 AM GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రచయిత, కాలమిస్ట్ నరేంద్ర లూథర్(88) కన్నుమూశారు. అయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. లూథర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన సేవలను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.పంజాబ్‌లోని హోషియాపూర్‌లో 23 మార్చి 1932న జన్మించిన నరేంద్ర ఉమ్మడి ఏపీ సీఎస్‌గా పదవీ విరమణ పొందారు.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని సేవ్ టు రాక్స్ సొసైటీ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు. లూథర్‌కు భార్య బింది, కుమారుడు రాహుల్, కుమార్తె ఉన్నారు.
Next Story