CM KCR : వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం..!

CM KCR : వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం..!
CM KCR : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. 6 గంటలుగా మంత్రివర్గం, అధికారులతో చర్చలు జరుపుతున్నారు సీఎం.

CM KCR : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. 6 గంటలుగా మంత్రివర్గం, అధికారులతో చర్చలు జరుపుతున్నారు సీఎం. కేబినెట్ భేటీలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో ఫాస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే BSC ఫారెస్ట్రీ చదివిన వాళ్లకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అటవీశాఖ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారుయ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాల్లో 25శాతం.........ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విభాగంలో 50శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్ రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇటీవల కురిసిన భారీవర్షాలతో వరంగల్ జిల్లాలో పెద్దఎత్తున పంటనష్టపోయారు రైతులు. వేల ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దెబ్బతిన్న పంటను పరిశీలించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు సీఎం కేసీఆర్. అకాల వర్షాలతో పంటనష్టం, రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై చర్చించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు, అధికారులతో చర్చించారు సీఎం కేసీఆర్. ధాన్యం పూర్తిగా కొనేంత వరకు కొనుగోలుకేంద్రాలు ఉంచాలని ఆదేశించారు. అటు రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపైనా చర్చ జరిగింది. కరోనా అదుపులోనే ఉందని వైద్య, ఆరోగ్యశాఖ కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది. మంత్రి హరీశ్‌రావు కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ కు వివరించారు.

మన ఊరు- మన బడి ప్రణాళికకు కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా 7వేల 289 కోట్ల రూపాయలతో ప్రభుత్వ బడుల్లో మౌలికవసతులను మెరుగుపరచనున్నారు. ఇక ప్రైవేట్ విద్యాసంస్థల నియంత్రణకు కొత్తచట్టం తేవాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ఫీజుల నియంత్రణ, ఆంగ్లమాధ్యమంపై అధ్యయనానికి సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రి సబిత అధ్యక్షత ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, తలసాని, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ, ఎర్రబెల్లి ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story