సీఎం ఆదేశాలతో సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచుతామన్న అధికారులు

సీఎం ఆదేశాలతో సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచుతామన్న అధికారులు
సచివాలయ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు.

కొత్తగా నిర్మిస్తున్న సచివాలయాన్ని ఏడాదిలోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పనుల వేగాన్ని పెంచాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఆకస్మికంగా సచివాలయ నిర్మాణపనులను పరిశీలించిన సీఎం.. నిర్మాణ గడువు పెంచేదిలేదని వారికి స్పష్టంచేశారు.

సచివాలయ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఎక్కడ ఏమి వస్తున్నాయో ఆరాతీశారు. నిర్మాణంలో వేగం పెంచాలని... అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రధాన గేటుతో పాటు ఇతర గేట్లు నిర్శించే ప్రాంతాలను, భవనాల డిజైన్లను పరిశీలించారు

నిర్మాణ ఆలస్యానికిగల కారణాలను అధికారులు సీఎంకు తెలియజేశారు. ఫౌండేషన్ వేసే క్రమంలో బండరాళ్లు రావడంతో పనుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంట్రాక్టర్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అందుకే పనుల్లో వేగం తగ్గిందన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో పనుల్లో వేగం పెంచుతామన్నారు అధికారులు. సీఎం కేసీఆర్‌ వెంట పలువురు మంత్రులు, రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story