Top

నిరాశ, నిస్పృహల్లో కొన్ని అరాచక శక్తులు ఆ పనిలో ఉన్నాయి : సీఎం కేసీఆర్

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంఐఎం నేత అక్బరుద్దన్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది..

నిరాశ, నిస్పృహల్లో కొన్ని అరాచక శక్తులు ఆ పనిలో ఉన్నాయి : సీఎం కేసీఆర్
X

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంఐఎం నేత అక్బరుద్దన్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా సీఎం కేసీఆర్‌ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. నిరాశ, నిస్పృహల్లో కొన్ని అరాచక శక్తులు ఈ పనిలో ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్‌. అలాంటివారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.

ఈ అరాచక శక్తుల కుట్రపై ప్రభుత్వం దగ్గర కచ్చితమైన సమాచారం ఉందన్నారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానమని, సంఘ విద్రోహ శక్తులను అణిచేందుకు పోలీసులకు పూర్తి స్వేఛ్చ ఇచ్చినట్లు తెలిపారు.సామరస్యాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వారిని, సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణిచేయాలన్నారు. మొదట సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేశారని, ఆ తర్వాత మార్ఫింగ్ ఫొటోలతో ప్రజల్ని ఏమార్చాలని చూశారన్నారు. మాటలతో కవ్వింపు చర్యలకు పూనుకున్నారంటూ ఫైర్‌ అయ్యారు. శాంతి కాముకులైన హైదరాబాద్ ప్రజలు అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదన్నారు.జిల్లాల్లో గొడవలు రాజేసి హైదరాబాద్‌కు విస్తరించాలని చూస్తున్నారన్నారు సీఎం కేసీఆర్‌..

సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. శాంతిభద్రతల సమస్య పేరుతో గ్రేటర్‌ ఎన్నికలను వాయిదా వేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. ఎంఐఎంతో కుమ్మక్కై ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. 12 శాతం మైనార్టీ ఓటర్లు ఉన్న బిహార్‌లో మజ్లిస్‌ తరఫున ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారని.. 80 శాతం హిందువులు ఉన్న హైదరాబాద్‌లో ఎంతమంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించాలని ప్రశ్నించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌, కాంగ్రెస్‌, టీడీపీలకు ఇప్పటివరకు అవకాశమిచ్చారని.. బీజేపీకి ఒక్క అవకాశమివ్వాలని ప్రజల్ని కోరారు సంజయ్‌..గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్ది... బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే తారస్థాయికి చేరిన మాటల తూటాలు.. తాజాగా సీఎం కేసీఆర్‌ సైతం ఘాటుగా స్పందించడంతో గ్రేటర్‌ ఎన్నికలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి.

Next Story

RELATED STORIES