తెలంగాణలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశం

Telangana Cm KCR Orders To Officers

KCR

Kcr:తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది.

KCR: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ అధికారులను అలర్ట్ చేసారు. బాల్కొండ నియోజకవర్గంలో తక్షణమే ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే నీట మునిగిన నిర్మల్ పట్టణానికి ఎన్టీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సీఎస్ సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు సీఎం కేసీఆర్.

భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్తా చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తోందని.. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలెవరూ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని ముఖ్యమంత్రి సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story