అసెంబ్లీ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం

అసెంబ్లీ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం
20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సిటింగ్ ఏ విధంగా ఏర్పాటు చేశారు..

అసెంబ్లీ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి అనే అంశాలపై అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, అధికారులతో సీఎం చర్చించారు. ఈ సమావేశాల్లో 4 బిల్స్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే సమావేశాలను 20 రోజులు నిర్వహించాలని మొదట అనుకున్నా.. కరోనా ఎఫెక్ట్‌తో వీలైనన్ని తక్కువ రోజులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో భౌతిక దూరం పాటించడానికి సిటింగ్ ఏ విధంగా ఏర్పాటు చేశారు అనే అంశాలను కూడా కేసీఆర్ ఆరా తీశారు. ఇదే అంశంపై శుక్రవారం మరోసారి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, విప్‌లు, అసెంబ్లీ కార్యదర్శితో సమావేశం నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story