తెలంగాణ

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష : కోత విధించిన 50శాతం తిరిగి చెల్లింపు

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష  : కోత విధించిన 50శాతం తిరిగి చెల్లింపు
X

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రెండు నెలల పాటు కోత విధించిన 50శాతం మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.120 నుంచి 130కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఆర్టీసీ ఉద్యోగుల భద్రతపై త్వరలో విధానపర నిర్ణయం తీసుకోనున్నారు. పార్శిల్ సర్వీసుల ఆదాయం ఒక మిలియన్ దాటిన నేపథ్యంలో అధికారులను కేసీఆర్ అభినందించారు. ఇక హైదరాబాద్ లో 50శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్ ను ఆదేశించారు.

Next Story

RELATED STORIES