కరోనా యోధులకు వేతనాలు పెంచాం : సీఎం కేసీఆర్

కరోనా యోధులకు వేతనాలు పెంచాం : సీఎం కేసీఆర్
కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో కరోనాపై చర్చలో..

కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో కరోనాపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. కరోనా యోధులకు వేతనాలు పెంచాం : సీఎం కేసీఆర్ చెప్పారు. కరోనా కట్టడికి నిత్యం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా నివారణ చర్యలన్నీ సభలో ప్రస్తావించడం సాధ్యం కాదన్నారు. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రుల దందా పెరుగిపోయిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ప్రశ్నకు సమాధానం చెప్పారు. కార్పోరేట్ ఆస్పత్రులపై నిఘా ఉండాల్సిందేనని అన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని... ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కరోనాకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story