సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన వాయిదా

సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన వాయిదా
తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన వాయిదా పడింది.. ఈ నెల 17న చిన్నజీయర్ స్వామితో కలిసి యాదాద్రికి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన వాయిదా పడింది.. ఈ నెల 17న చిన్నజీయర్ స్వామితో కలిసి యాదాద్రికి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. చిన్న జీయర్ స్వామితో కలిసి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి… పునఃప్రారంభ ముహూర్తంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక ఆలయ పునర్నిర్మాణానికి ముందు మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని గతంలోనే సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుమారు 3వేల మంది వేదపండితులు, రుత్విక్కులతో యాగం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనున్నారు. దీనిపై కేసీఆర్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి రావాలని ఆహ్వానించారు. దీనికి ప్రధాని సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రపతి కోవింద్‌ను కూడా ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తునట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం ఆలయ పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి పర్యటనలో ఆలయ తుదిదశ పనులను సీఎం పరిశీలిస్తారు.

ప్రధాన ఆలయంలో సూచించిన మార్పులతో పాటు మాడవీధులు, గర్భాలయం ప్రాంగణంలో అలంకరణలు, విద్యుత్‌ లైట్లు, శివాలయం విస్తరణ పనులను పరిశీలిస్తారు. వీటితో పాటు రథశాల, శ్రీవారి మెట్లు, క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్‌ పనులను కూడా సీఎం పరిశీలించి తుది మెరుగులకు సూచనలిస్తారు. ఇప్పటికే యాదాద్రి ఆలయ పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా 10 శాతం పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story