Chief Minister: సీఎం ప్రమాణ స్వీకారం వాయిదా

Chief Minister: సీఎం ప్రమాణ స్వీకారం వాయిదా
సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిన శివకుమార్

రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు చేసినా ఇవాళ ప్రమాణ స్వీకారానికి అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త సీఎం ఎంపికపై ఉదయం సమావేశమైన కాంగ్రెస్ శాసనసభాపక్షం సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతల్ని అధిష్టానానికి కట్టబెట్టింది. దీంతో రేపు అధిష్టానంతో చర్చించేందుకు డి.కె శివకుమార్ దిల్లీ వెళ్లారు.

తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్న తరుణంలో.... CLP నాయకుడు ఎవరనే అంశంపై ఇంకా సందిగ్ధత వీడలేదు. దీంతో C.M ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉదయం గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ...గెలిచిన ఎమ్మెల్యేలతో డి.కె.శివకుమార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికే అప్పగిస్తూ ఎమ్మెల్యేలంతా ఏకవాక్య తీర్మానం చేశారు. CLP నేత ఎంపిక బాధ్యతను AICC అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు బలపరిచారు. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని స్పష్టం చేశారు. సీఎల్పీ భేటీలో చేసిన తీర్మానాన్ని AICCపరిశీలకులు అధిష్ఠానానికి పంపించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నామన్న డి.కె. శివకుమార్ ... సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఖర్గేకే ఇవ్వాలని చెప్పారని తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం పంపిన తీర్మానంపై అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తైనా... దిల్లీ నుంచి ఎలాంటి స్పష్టత లేక ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ పరిణామాల నడుమ CLP నేత ఎంపికపై అధిష్ఠానంతో చర్చించేందుకు డి.కె.శివకుమార్ దిల్లీ వెళ్లారు. హస్తిన నుంచి ప్రకట వచ్చాకే కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే సీఎం ప్రమాణ స్వీకారంపై పూర్తి స్పష్టత రానుంది.

Tags

Read MoreRead Less
Next Story