NUMAISH: నుమాయిష్‌ను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి

NUMAISH: నుమాయిష్‌ను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి
45 రోజులపాటు జరగనున్న నుమాయిష్‌... ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్‌ ఆదేశం

నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలకు..... ప్రభుత్వం తరపున ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమని... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నుమాయిష్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. నేటి నుంచి 45 రోజులపాటు.. నుమాయిష్‌ జరగనుంది. 2,400 స్టాళ్ల ద్వారా వివిధ రకాల ఉత్పత్తులను... ఇక్కడ ప్రదర్శనకు ఉంచనున్నారు. నుమాయిష్‌ ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్‌, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నంను.... నుమాయిష్‌ కమిటీ సత్కరించింది. నుమాయిష్‌లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు..... వ్యాపారులు పాల్గొంటారన్న సీఎం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఈ సందర్భంగా రేవంత్‌ పలు హామీలను ఇచ్చారు. వంద పడకల ఆస్పత్రి ఉన్నచోట నర్సింగ్ కళాశాల ఉంటుందని...విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ క్లాసులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా దేశాలకు కావాల్సిన మానవ వనరులను ప్రభుత్వం ద్వారా అందిస్తామని తెలిపారు. ఔత్సాహికులైన యువతకు ఆసక్తి ఉన్న విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామన్న CM... శిక్షణా తరగతుల్లో సీనియర్ అధికారుల సేవలు వాడుకుంటామని తెలిపారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ భర్తీ తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని కృషి చేస్తామన్నారు. 100 రోజుల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ పాలనలో చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ఉండదన్నారు. బుధవారం PCC విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామని ఆయన తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్న CM.. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పదవులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యవస్థలన్నిటినీ స్ట్రీమ్‌లైన్ చేసే పనిలో నిమగ్నమైనట్లు... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. దూరం తగ్గించి..... పాతబస్తీ మీదుగా విమానాశ్రయం వరకూ మెట్రో నిర్మిస్తామని సీఎం పునరుద్ఘాటించారు. రింగ్‌రోడ్‌, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య క్లస్టర్లుగా ఫార్మాసిటినీ నిర్మిస్తామన్నారు. చదువు పూర్తికాగానే క్యాంపస్‌లోనే యువత ఉద్యోగం సాధించేలా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. పార్టీ కోసం పనిచేసేవారికి

నామినేటెడ్‌ పదవులు ఇస్తామని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని..... ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్‌పవర్‌ను.... తెలంగాణ ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story