తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో మళ్లీ గందరగోళం

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో మళ్లీ గందరగోళం
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సారి కూడా ఉన్నత విద్యామండలి తీరు మార్చుకోలేదు. ఎంసెట్‌ ర్యాంకుల కేటాయింపుల్లో అవకతవకలు..

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సారి కూడా ఉన్నత విద్యామండలి తీరు మార్చుకోలేదు. ఎంసెట్‌ ర్యాంకుల కేటాయింపుల్లో అవకతవకలు.... విద్యార్థుల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. ఎంసెట్‌లో కటాఫ్ మార్కులు వచ్చినా.. ఇంటర్మీడియట్‌‌ అన్ని సబ్జెక్టుల్లో పాసైనా.. రిజల్ట్‌లో మాత్రం ఫెయిల్డ్ ఇన్ క్వాలి ఫైయింగ్ అని ఫలితం వస్తోంది. ఈ ఫలితాలు చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు షాక్ అవుతున్పారు. అయితే... పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు సైతం ర్యాంకులు కేటాయించారు. కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయి ప్రమోటైన వారికి కూడా ర్యాంకులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది.

అటు... ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తీరుపై ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బాలమూరి వెంకట్ విమర్శలు చేశారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి 24 గంటల్లో చేసిన తప్పున సరిదిద్దుకోవాలని అన్నారు. లేదంటే విద్యార్థుల పక్షాన ఎన్‌ఎస్‌యూఐ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం తప్పుల్ని సవరించే వరకు అక్టోబర్ 9న జరిగే ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్డుకుంటామని తెలిపారు. విద్యార్థులు ఎవరు ఆందోళన చెందవద్దని.... ఎన్‌ఎస్‌యూఐ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story