టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌, శివసేన నాయకులు

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌, శివసేన నాయకులు
దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి హరీష్‌రావు దగ్గరుండి.. ఆమెతో నామినేషన్‌ వేయించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి కూడా..

దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి హరీష్‌రావు దగ్గరుండి.. ఆమెతో నామినేషన్‌ వేయించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి కూడా వారి వెంట ఉన్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం జరిగిన ప్రచార కార్యక్రమంలో... హరీష్‌ టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు.

దుబ్బాక నియోజకవర్గం తొగుటలో మంత్రి హరీశ్‌ రావు పర్యటించారు. కాంగ్రెస్‌, శివసేన పార్టీలకు చెందిన నాయకులు.. హరీశ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని హరీశ్‌ రావు అన్నారు. భారీ మెజార్టీతో సుజాతను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆయన వెంట ఉన్నారు. అంతకుముందు.. మారెమ్మ దేవాలయం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ అంటే పోరగాళ్ల పార్టీ అంటున్నారని.. ఆ పోరగాళ్లే నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమయ్యారని.. నాయకులు వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story