మొదటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న గాంధీ ఆస్పత్రి సఫాయి కార్మికురాలు

మొదటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న గాంధీ ఆస్పత్రి సఫాయి కార్మికురాలు
కరోనా వైరస్ దేశంలోని ప్రముఖులనెందరినో పొట్టన పెట్టుకుంది.

కోవిడ్ నుంచి కొంచెం రిలీఫ్. వ్యాక్సిన్ వచ్చి కొంత ఊరటనిచ్చింది. గాంధీ ఆస్పత్రిలో మంత్రి ఈటల రాజేందర్ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మొదటి వ్యాక్సిన్‌ను ఆస్పత్రిలో పనిచేసే సఫాయి కార్మికురాలు కృష్ణమ్మకు ఇచ్చారు. రాష్ట్రంలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. కరోనా వైరస్ దేశంలోని ప్రముఖులనెందరినో పొట్టన పెట్టుకుంది.

వైరస్ ప్రభావం తగ్గిందని అనుకోవడానికి లేకుండా ఇంకా అక్కడక్కడా కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య మునుపటి కంటే మెరుగ్గా ఉంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన వ్యాక్సిన్.. ప్రధాని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. కరోనా వల్ల ఆప్తులను కోల్పోయాం.

హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్యామిలీని వదిలేసి మరీ వర్క్ చేశారు. అందుకే వ్యాక్సిన్ ముందుగా వాళ్లకే ఇచ్చాం అని అన్నారు. కాగా వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బంది, పోలీస్, మున్సిపల్, ఫైర్, గ్రామపంచాయితీ.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్‌లకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని ఈటల అన్నారు. వ్యాక్సిన్ ద్వారా కరోనాకు చరమ గీతం పాడదాం అని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story