తెలంగాణలో కరోనా రికవరీ రేటు 86.26 శాతం

తెలంగాణలో కరోనా రికవరీ రేటు 86.26 శాతం

తెలంగాణలో కొత్తగా మరో 19 వందల 83 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 2 వేల 594కి చేరినట్టు.. వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26 వేల 644 యాక్టివ్‌ కేసులు ఉండగా... వారిలో 21 వేల 784 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజులో కరోనాతో 10 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 11 వందల 81కి చేరింది. తెలంగాణలో నిన్న ఒక్క రోజులో 2 వేల 381 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఒక లక్షా 71 వేల 769 మంది కోలుకున్నట్టు హెల్త్‌ బులెటిన్‌లో ప్రభుత్వం తెలిపింది. అటు.. నిన్న ఒక్క రోజులో 50 వేల 899 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 32 లక్షల 92 వేల 195కి చేరింది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 86.26 శాతం ఉండగా... మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story