Crime: అత్తాపూర్‌లో కిడ్నాప్‌ కలకలం

Crime: అత్తాపూర్‌లో కిడ్నాప్‌ కలకలం
సినీ ఫక్కీలో యువతిని కిడ్నాప్‌ చేసిన ప్రియుడు, అతని తమ్ముడు

హైదరాబాద్‌ అత్తాపూర్‌లో కిడ్నాప్‌ కలకలం రేగింది. ఓ కేసు విషయంపై అత్తాపూర్ గోల్డెన్ హైట్‌కు వచ్చిందో యువతి. దీంతో ఆమె మాజీ ప్రియుడు, అతని తమ్ముడు సినీ ఫక్కీలో కిడ్నాప్‌ చేశారు. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లో కేసును చేధించారు. కారు జీపీఎస్‌ ఆధారంగా మహ్మద్‌ హసన్‌, మహ్మద్‌ రియాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. మలక్‌పేటకు చెందిన యువతిని ప్రేమ పేరుతో హసన్‌ మోసం చేసి.. పెళ్లి చేసుకుని నాలుగేళ్లకే విడాకులు ఇచ్చాడు. ఆ కేసు విషయంలో ఆ యువతి అత్తాపూర్‌ రాగా కిడ్నాప్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story