బైక్‌కు చలానా పడకుండా నెంబర్ ప్లేట్ కి బట్ట అడ్డం పెట్టాడు!

బైక్‌కు చలానా పడకుండా నెంబర్ ప్లేట్ కి బట్ట అడ్డం పెట్టాడు!
తాజాగా హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణిస్తోన్న ఓ ప్రయాణికుడు చలానాలు తప్పించుకోవడం కోసం బైక్ నంబర్ ప్లేట్‌ను కవర్ చేసేలా క్లాత్ పెట్టాడు.

ట్రాఫిక్ రూల్స్ అనేవి మన మంచి కోసమే.. కానీ వాటిని పట్టించుకోకుండా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అంతే కాకుండా చలానా నుంచి తప్పించుకోవడం కోసం వేసే వేషాలు అయితే అన్నీ ఇన్నీ కావు. నెంబర్ ప్లేట్‌ మీద చున్నీ వేయడం, టీఎస్‌ తర్వాత వచ్చే ఆల్ఫాబెట్‌ సిరీస్‌ కనిపించకుండా చేయడం వంటివి చేస్తుంటారు.

అయితే ఇలా చేసేవారికి ఎలాంటి జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. తాజాగా హెల్మెట్ లేకుండా బైక్‌పై ప్రయాణిస్తోన్న ఓ ప్రయాణికుడు చలానా నుంచి తప్పించుకోవడం కోసం బైక్ నెంబర్ ప్లేట్‌ను కవర్ చేసేలా క్లాత్ వేశాడు.

ఈ ఫొటోను ట్వీట్ చేసిన సైబరాబాద్ పోలీసులు ఇతడి నెంబర్ ప్లేట్ ఎలా కనుక్కోగలం అనుకుంటున్నారా? అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే వారి ట్వీట్ కి నెటిజన్లు సమాధానం ఇస్తున్నారు.

అతడు వెళ్తున్న ఏరియాలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ముందు నెంబర్ ప్లేట్ కనిపిస్తుంది. పోలీసులకు అదేమంత కష్టం కాదని ఓ నెటిజన్ బదులిచ్చాడు. అంతేకాకుండా మరో నెటిజన్ ఫన్నీగా మీరేమైనా చేయగలరు.. ఎవరినైనా పట్టుకోగలరు.. ఆఖరికి దేవుడిని కూడా అంటూ సమాధానం ఇచ్చాడు.


Tags

Read MoreRead Less
Next Story