Bullet Bandi Dance : జగిత్యాలలో వేయి మంది ఆడపిల్లలతో బుల్లెట్ పాటకు డ్యాన్స్‌

Bullet Bandi Dance :  జగిత్యాలలో వేయి మంది ఆడపిల్లలతో బుల్లెట్ పాటకు డ్యాన్స్‌
Bullet Bandi Dance : బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా పాటకు మరో అరుదైన గౌరవం దక్కింది. జగిత్యాలలో వేయి మంది ఆడపిల్లలు ఈ పాటకు డ్యాన్స్‌ చేశారు.

Bullet Bandi Dance : బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా పాటకు మరో అరుదైన గౌరవం దక్కింది. జగిత్యాలలో వేయి మంది ఆడపిల్లలు ఈ పాటకు డ్యాన్స్‌ చేశారు. దీంతో ఈ ఈవెంట్‌ ఇంటర్నేషనల్ వండర్‌ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. నిన్న సాయంత్రం జగిత్యాలలోని వివేకానంద మినీ స్టేడియంలో.. కళాకారుడు మచ్చు రవి బృందం వెయ్యి మంది ఆడపిల్లలు, చిన్నారులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. బుల్లెట్టు బండి పాటకు పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సాయిశ్రియ సైతం ఈ ఈవెంట్‌కు వచ్చారు.

ఇంటర్నేషనల్ వండర్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఈ ఈవెంట్‌ ఎక్కడం జగిత్యాలకే గర్వకారణం అన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మచ్చు రవిని ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవిశంకర్‌, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జిల్లా కలెక్టర్‌ రవి అభినందించారు. ఈవెంట్‌ను ఇంటర్నేషనల్ వండర్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రతినిధులు.. ధృవీకరణ పత్రాన్ని, రికార్డ్స్‌ మెమెంటోను మచ్చు రవికి అందజేశారు.

Tags

Read MoreRead Less
Next Story