Double Bedroom: ఇళ్లు నిర్మించారు..కానీ

Double Bedroom: ఇళ్లు నిర్మించారు..కానీ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎదురుచూపులు

గతప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరాశే మిగిల్చింది. కొన్ని చోట్ల పూర్తిచేసి లబ్ధిదారులకు ఇచ్చినా …...... సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని చోట్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నా పంపిణీ పూర్తి కాలేదు. కొత్త ప్రభుత్వమైనా న్యాయం చేయాలని పేద ప్రజలు వేడుకుంటున్నారు.

రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటికలను సాకారం చేసే లక్ష్యంతో గతంలో భారాస ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. వరంగల్ జిల్లాలో పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. మరికొన్ని చోట్ల పూర్తైనా ఇళ్లమంజూరులో జాప్యం జరిగింది ఉండటానికి గూడులేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

హనుమకొండ జిల్లాకు పదేళ్ల క్రితం గుడిసెల్లో జీవిస్తున్న నిరుపేదల వద్దకు అప్పటి సీఎం KCR వచ్చి బాగోగులు తెలుసుకున్నారు. వారి కష్టాలను చూసి సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. రెండు పడకగదులు నిర్మించి ఇస్తామని ప్రకటించడంతో .. కేసీఆర్ హామీ మేరకు బహుళ అంతస్తుల్లో నిర్మాణాలు మంజూరయ్యాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బాలసముద్రంలోని ఏషియన్ మాల్ సమీపంలోని శిఖం భూమిలో ఒక్కో బ్లాకులో 10 చొప్పున మొత్తం 57 బ్లాకుల్లో నిర్మించారు. 582 మంది లబ్దిదారులకు కేటాయించేలా 2019లో పూర్తి చేశారు . నిర్మాణం పూర్తైనా లబ్దిదారుల ఎంపికలో జాప్యం జరగ్గా ఐదేళ్లుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నామని గుడిసెవాసులు వాపోతున్నారు.

వరంగల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు 6వేల 300 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరు కాగా కేవలం 2 వేలే పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తైనా..... లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిసారించి లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story