Delhi Liquor Scam:ఇవాళ విచారణకు రాలేను: ఎమ్మెల్సీ కవిత

Delhi Liquor Scam:ఇవాళ విచారణకు రాలేను:  ఎమ్మెల్సీ కవిత
11వ తేదీన విచారణకు వస్తానని ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌కు లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇవాళ విచారణకు రాలేనంటూ ఈడీ అధికారులకు లేఖ రాశారు. ముందస్తు కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు. ఇక 11వ తేదీన విచారణకు వస్తానని ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌కు లేఖ ద్వారా తెలిపారు.

మరోవైపు ఈడీ తీరుపై కవిత మండిపడ్డారు. ఇంత హడావుడిగా దర్యాప్తు చేయడం ఏంటని ప్రశ్నించారు. స్వల్పకాలంలో విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని కవిత తన లేఖలో ఈడీని నిలదీసినట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ.. నేరుగా ఈడీ కార్యాలయానికి పిలవడంలో మతలబేంటో అర్థం కావడం లేదన్నారు. ఒక మహిళను తన నివాసంలో విచారించాలని కోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. వీటన్నింటిని ఎందుకు పరిగణలతోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇక రాజకీయ కక్షలో భాగంగానే నోటీసులు జారీ చేసినట్టు కవిత ఆరోపించారు. దేశ పౌరురాలిగా చట్టపరమైన అన్ని హక్కులూ ఉపయోగించుకుంటానని అన్నారు.

రేపు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మహిళా బిల్లు ఆమోదం కోసం కవిత దీక్ష చేపట్టనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం రెండు రోజులపాటు ముందస్తు షెడ్యూల్‌ కార్యక్రమాలు ఉన్నాయని కవిత ప్రకటన జారీ చేశారు. అనంతరం కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే భారత జాగృతి చేపట్టిన ధర్నా ఏర్పాట్ల కోసమే కవిత ఢిల్లీ వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత లేఖపై ఈడీ మాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే విచారణపై ఉత్కంఠ కొనసాగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story