గందరగోళానికి దారితీసిన ఇళ్ల పట్టాల పంపిణీ

గందరగోళానికి దారితీసిన ఇళ్ల పట్టాల పంపిణీ

నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ గందరగోళానికి దారితీసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎలిమినేటి మాధవరెడ్డి కృషితో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యాయని స్థానికులు తెలిపారు. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేశారని మండిపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన వారికి ఆ ఇళ్ల స్థలాలు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. కనీసం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారని.. అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు.

Tags

Read MoreRead Less
Next Story