బెడిసి కొట్టిన 'బుల్లెట్టు బండి డాన్స్'.. నర్సుకు షాక్..!

బెడిసి కొట్టిన బుల్లెట్టు బండి డాన్స్.. నర్సుకు షాక్..!
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోతున్నారు. అలాగే ఈ మధ్య బుల్లెట్టు బండి పాటకి డాన్స్ అదరగొట్టి సెలబ్రిటీగా మారిపోయింది

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోతున్నారు. అలాగే ఈ మధ్య బుల్లెట్టు బండి పాటకి డాన్స్ అదరగొట్టి సెలబ్రిటీగా మారిపోయింది నవవధువు సాయిశ్రీయ. అదే పాటకి తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రం పీహెచ్‌పీలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ నర్సు జ్యోతి డాన్స్ చేసి ఆదరగోట్టింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది కాస్త అధికారుల కంట పడడంతో నర్సు డ్యాన్స్‌ బెడిసి కొట్టింది. ఇండిపెండెన్స్‌ డే రోజున.. విధుల్లో ఉండగా డ్యాన్స్‌ చేయడంతో జ్యోతికి జిల్లా వైద్యాధికారి మెమో జారీ చేశారు. అయితే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంతోషంగా మాత్రమే డ్యాన్స్‌ చేసినట్లు వైద్య సిబ్బంది పేర్కొన్నారు. కాగా జ్యోతికి మెమో జారీ చేయడం పట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ఇందులో తప్పేముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story