రామాయంపేట : వేధింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు : జిల్లా ఎస్పీ

రామాయంపేట : వేధింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు :   జిల్లా ఎస్పీ
రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్ ఇంటిముందు స్థానికులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తలకు దారితీసింది.

మెదక్ జిల్లా రామాయంపేటలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆత్మహత్య చేసుకున్న రియల్‌ ఎస్టేట్ వ్యాపారి సంతోష్‌, అతని తల్లి పద్మల డెడ్ బాడీలను రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్ ఇంట్లోవేసి బంధువులు, స్థానికులు ఆందోళన చేస్తున్నారు. పెద్దసంఖ్యలో ఇంటిని ముట్టడించిన స్థానికులు .. ఇంటి అద్దాలు, కిటికీలను ధ్వంసం చేశారు. మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ దీనిపై మాట్లాడారు.

రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్ ఇంటిముందు స్థానికులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తలకు దారితీసింది. పరిస్థితి చేయిదాటి పోవడంతో జిల్లా ఎస్పీ రోహిణి తనబలగాలతో అక్కడికిచేరుకొని పరిస్థితి అదుపుచేసే ప్రయత్నంచేశారు. మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతదేహాలను తరలించేందుకు ఒప్పించారు. అయితే అక్కడ ఆందోళన చేస్తున్న స్థానికులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకలుచెందిన నాయకులు అందుకు ఒప్పుకోలేదు. మున్సిపల్ ఛైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేధింపులకు పాల్పడిన వారిపై కేసు పెట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

రామాయంపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సంతోష్‌, అతని తల్లితో కలిసి కామారెడ్డి పట్టణంలోని ఓ లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు. మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్‌తోపాటు మొత్తం ఏడుగురు తమను వేధిస్తున్నారంటూ ఆత్మహత్యకు ముందు సంతోష్‌, పద్మలు సెల్ఫీవీడియో తీసుకున్నారు. అయితే వారి డెడ్ బాడీలను రామాయంపేటకు తరలించిన బంధువులు.. వీరి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం అంతిమాయత్ర చేపట్టిన బంధువులు.. డెడ్ బాడీలను మున్సిపల్ ఛైర్మన్ ఇంటిముందువేసి ఆందోళనకు దిగారు.

Tags

Read MoreRead Less
Next Story